VIDEO: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
SDPT: సిద్దిపేట చార్వీత మేడోస్‌లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రామగుండంకు చెందిన మాజీ ఆర్మీ అధికారి శ్రీకాంత్ మరో ముగ్గురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.15-20 లక్షల విలువైన బంగారం, నగదును రికవరీ చేశారు. నిందితులపై డెకాయిట్ కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.