'సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు'
KDP: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు SP నచికేత్ వెల్లడించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా, తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.