ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీహరి
NRPT: జూబ్లీహిల్స్ వెంగళరావునగర్‌లోని ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముదిరాజ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, మత్స్యశాఖకు రూ. 123 కోట్లు కేటాయించిందని శ్రీహరి తెలిపారు. బీసీ- డీ నుంచి బీసీ- ఏ వర్గానికి మారుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.