చలో కార్పొరేషన్ జయప్రదం చేయండి: బాషా
KDP: పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 16న చేపట్టే 'చలో కార్పొరేషన్' ను జయప్రదం చేయాలని కడప నగర కార్యదర్శి మక్బూల్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం భగత్ సింగ్ నగర్‌లో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పేదలు ఇళ్లకు నోచుకోవడం లేదని, ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.