VIDEO: శ్రీవారిని దర్శించుకున్న 'రాకాస' చిత్ర బృందం
TPT: తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం నిర్మాత నిహారిక కొణిదెల, సంగీత్ శోభన్, నయన్ సారిక , గెటప్ శ్రీను దర్శించుకున్నారు. ఈనెల 3న విడుదలైన వారి తాజా చిత్రం 'రాకాస' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్ర బృదం స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వీరు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.