జాజాపూర్‌లో శాఖల సంగమం
NRPT: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉట్కూరు మండల స్థాయి ‘శాఖల సంగమం’ను ఆదివారం జాజాపూర్ గ్రామంలో నిర్వహించారు. స్వయంసేవకులు శారీరక విన్యాసాలు ప్రదర్శిస్తూ.. క్రమశిక్షణ, సంఘబలం చాటారు. దేశ రక్షణ, సమాజ సేవ, హైందవ ధర్మ పరిరక్షణే సంస్థ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.