రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్పీ కీలక సూచనలు

రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్పీ కీలక సూచనలు

KRNL: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం రాత్రి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, డ్రైవర్లు నిద్ర మత్తులో వాహనం నడపకూడదని హెచ్చరించారు. నిద్ర వస్తే వాహనాన్ని పక్కకు ఆపి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని తెలిపారు.