VIDEO: డెంకాడలో అరుదైన చిప్పల అలుగు ప్రత్యక్షం

VIDEO: డెంకాడలో అరుదైన చిప్పల అలుగు ప్రత్యక్షం

VZM: డెంకాడ మండలంలోని గుణుపూరుపేటలో అరుదైన చిప్పల అలుగు ప్రత్యక్షమైంది. బుధవారం అర్ధరాత్రి గ్రామ శివారులో అలుగు సంచారాన్ని గుర్తించిన స్థానికులు బందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని అలుగును స్వాధీనం చేసుకున్నారు. కాగా అంతరించిపోతున్న జాతుల్లో అలుగు ఒకటిగా చెప్పవచ్చు.