VIDEO: హఫీజ్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

VIDEO: హఫీజ్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

HYD: హఫీజ్‌పేట్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం.. రుమాన్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.