'చెరువు పునర్నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్'
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ మంథనిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనులను పరిశీలించారు. వచ్చే సోమవారం నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి కనీసం 50 శాతం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.