స్టార్మ్ వాటర్ పైప్ లైన్ పనులపై కార్పోరేటర్ అసంతృప్తి
RR: కొత్తపేట డివిజన్‌లోని ఎస్ఆర్ఎల్ కాలనీలో స్టార్మ్ వాటర్ పైప్ లైన్ పనులపై కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా సక్రమంగా పనులు సాగటం లేదని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, రోజువారీగా పనులను వేగవంతంగా నిర్వహించాలన్నారు.