బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
NLG: మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి తండా కాంగ్రెస్ అధ్యక్షుడు బాదావత్ వనిత ప్రతాప్ సింగ్ నాయక్‌తోపాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, విజయసింహారెడ్డి BRS కండువాలు కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. రానున్న జీపీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని వారికి సూచించారు.