ప్రమాదకర గుంట.. ఆందోళనలో ప్రజలు

ప్రమాదకర గుంట.. ఆందోళనలో ప్రజలు

ప్రకాశం: ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో కుళాయి కనెక్షన్ కోసం తవ్విన గుంటను పూడ్చకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ పాఠశాల సమీపంలో ఉండటంతో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు రాకపోకల సమయంలో టీచర్లు, ఆయాలు కాపలా కాస్తున్నారన్నారు. అధికారులు వెంటనే గుంటను పూడ్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.