'రోడ్డు మరమ్మత్తుపై అధికారుల సీతకన్ను'

'రోడ్డు మరమ్మత్తుపై అధికారుల సీతకన్ను'

SRD: పటాన్ చెరువు మండలం బానూరు నుంచి పారిశ్రామిక ప్రాంతాల వైపు వెళ్లే ప్రధాన క్యాసారం రోడ్డుపై అధికారులు సీతకన్ను వేస్తున్నట్లు CPM నాయకుడు సుధాకర్ కన్నెర్ర చేశారు. అకాల వర్షాలకు ప్రధాన రోడ్డు మొత్తం గుంతల మయమైందని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి, ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులను రక్షించి, రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు.