ఘోర రొడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

KDP: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరు వాసులు మృతి చెందారు. మైదుకూరుకి చెందిన కమాల్ బాషా, మున్నీ కుటుంబీకులు హైదరాబాద్‌కు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా వీరి కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమాల్ బాషా, మున్నీ మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.