లండన్ రైలులో కత్తి దాడుల కలకలం
లండన్‌లో కత్తిదాడులు కలకలం రేపాయి. లండన్ వెళ్తున్న రైలులో ఇద్దరు అనుమానితులు అనేక మంది ప్రయాణికులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. యూకే పోలీసులు వారిని అరెస్టు చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని తూర్పు గ్రామీణ పట్టణం హంటింగ్‌డన్‌లో దాడి గురించి సమాచారం రావడంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనపై ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు.