'విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి'

'విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి'

W.G: తాడేపల్లిగూడెం పెన్షనర్ల భవనంలో జరిగిన సంఘం నెలవారీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ కార్యదర్శి వైవీఎస్. మూర్తి మాట్లాడుతూ.. పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, 30 శాతం తాత్కాలిక భృతిని కూడా చెల్లించాలని కోరారు.