'వర్షానికి అప్రమత్తంగా ఉండాలి'

ADB: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డా.జితేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం నార్నూర్ మండల కేంద్రంతో పాటు తాడిహత్నూర్, నాగల్కొండ, మల్కుగూడ, గుంజాల గ్రామాల్లో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. యాంటీ లార్వా శానిటైజేషన్ చేపట్టారు.