టీఆర్పీలో చేరిన హైకోర్టు న్యాయవాది
MNCL: హైకోర్టు న్యాయవాది చుంచు లక్ష్మీ నారాయణ గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. గురువారం మంచిర్యాలలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, తీన్మార్ మల్లన్న పోరాట స్ఫూర్తికి ఆకర్షితమై పార్టీలో చేరినట్లు తెలిపారు.