ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాను స్వాధీనం చేసుకునేందుకు ఆ దేశం ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పారు. 'ఇరాన్ క్షిపణుల్లో కొన్ని ఈ యుద్ధం ప్రారంభానికి చాలా కాలం ముందే గురి పెట్టి ఉన్నాయి. వాటిని లోడ్ చేసి దాడులకు సిద్ధంగా ఉంచారు. కానీ మేము ఇందులోకి రావడంతో అది కష్టతరమవుతోంది' పేర్కొన్నారు.