'ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చూడాలి'
KDP: ప్రజా సమస్యలపై అధికారులు నిజాయితీగా వ్యవహరించి, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సూచించారు. ఇందులో భాగంగా కడప కలెక్టరేట్‌లో ప్రజావేదికలో ఆమె అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. అనంతరం ప్రతి అర్జీకి గడువులోగా నాణ్యమైన పరిష్కారం ఉండాలని ఆమె తెలిపారు.