నేడు బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన
NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మండలంలోని దామరమడుగు పంచాయతీలో నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.