నెల్లూరు రూరల్‌లో మార్చి 22న అభివృద్ధి పండగ

నెల్లూరు రూరల్‌లో మార్చి 22న అభివృద్ధి పండగ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం కూటమి నాయకులు, కార్యకర్తలతో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్చి 22న స్థానిక ప్రజల చేతుల మీదుగా రూ.27 కోట్లు విలువైన 240 పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రూరల్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.