ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: సమరం రెడ్డి
NLG: సీఎం సహాయనిధి పేదలకు వరమని శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి అన్నారు. మండలంలోని ఆకారం గ్రామానికి చెందిన బొంత వెంకన్నకు ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో మంజూరైన రూ.60 వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమరం రెడ్డి బుధవారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వేముల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.