తాడికొండలో అడిషనల్ ఎస్పీ పర్యటన

GNTR: తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం గుంటూరు అడిషనల్ ఎస్పీ ఏ.టీ.వీ రవి కుమార్ పర్యటించారు. ఈ మేరకు వినాయక ఉత్సవాల కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయబద్ధంగా తీన్మార్, కోలాటాలతో పండుగ జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.