HPV టీకా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన రెవెన్యూ అధికారి

HPV టీకా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన రెవెన్యూ అధికారి

అన్నమయ్య: గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఆరోగ్య శాఖ చేపట్టిన HPV టీకా ప్రచార పోస్టర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు విడుదల చేశారు. జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకా అందుబాటులో ఉందని, తల్లిదండ్రులు సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, PHCలు, CHCలకు తీసుకువెళ్లి టీకా వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన వివరించారు.