తస్లీమా విజయంపై ఎమ్మెల్యే పార్థసారథి హర్షం
KRNL: యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో స్వర్ణ పతకాలు పొందిన తస్లీమాను ఆదోని MLA పార్థసారథి అభినందించారు. నిన్న ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో కష్టపడి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. తస్లీమా విజయానికి తోడ్పడిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మైనారిటీ బాలికలు కూడా చదువులో ముందుకు రావాలని ఆకాంక్షించారు.