కళాశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు

NLR: పొదలకూరులోని కాకతీయ జూనియర్ కాలేజీలో శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాదర్ వల్లి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో చేపటినట్లు మండల వైద్యాధికారి వి.నరసింహారావు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు చర్మంపై లేత ఎర్రటి మచ్చలు, స్పర్శ లేని మచ్చలు అడిగి తెలుసుకున్నారు.