అజిత్‌కు అరుదైన గౌరవం

అజిత్‌కు అరుదైన గౌరవం

తమిళ స్టార్ హీరో అజిత్‌కు అరుదైన గౌరవం లభించింది. సినీ ఐకాన్‌గా తన ప్రయాణంతో పాటు రేసర్‌గా ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన 'జెంటిల్‌మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు దక్కింది. ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన ఈ వేడుకల్లో ఫిలిప్ చారియెల్ మోటార్‌స్పోర్ట్ గ్రూప్ ఈ గౌరవాన్ని అజిత్‌కు ప్రదానం చేసింది.