స్మార్ట్ కిచెన్ దేశానికే ఆదర్శం: నీతి ఆయోగ్ అధికారి
KDP: నీతి ఆయోగ్ జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ చింతకొమ్మదిన్నెలోని స్మార్ట్ కిచెన్ పనితీరును అద్భుతంగా అభివర్ణించారు. బుధవారం, రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా 33 పాఠశాలల్లోని 1758 మంది విద్యార్థులకు రుచికరమైన భోజనం అందుతుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.