ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

SRCL: వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో దేవోళ్ల సుమలత అలియాస్ పద్మ తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు భర్త హనుమంతు జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశం అయిన బహెరాన్ వెళ్ళి గత 40 రోజుల క్రితం గుండె పోటుతో మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ప్రతి రోజు కుమిలి కుమిలి ఏడుస్తున్న సుమలత భర్త ఎడబాటుతో మనోవేదనకు గురై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది.