పేదరికం లేని రాష్ట్రంగా కేరళ
ASR: దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా కేరళ నిలిచిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీ.చిన్నయ్య తెలిపారు. కేరళ రాష్ట్రంలా మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎందుకు తయారు చేయడం లేదని ప్రశ్నించారు. సోమవారం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 31 నుంచి జనవరి 4 వరకూ విశాఖలో జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలన్నారు.