దంపతుల గొడవ.. వదిలేసి వెళ్లిన విమానం

HYD: విమానంలో దంపతులు గొడవ పడడంతో వారిని దించేసి వెళ్లిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన వందిత్, సాక్షి దంపతులు ఇటీవల HYD వచ్చారు. తిరిగి ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఇ-7121 విమానంలో వెళ్లడానికి టికెట్లు తీసుకున్నారు. వారు విమానంలో గొడవ పడ్డారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది సముదాయించినా ఆగలేదు. దీంతో వారిని దించేసి విమానం వెళ్లిపోయింది.