ప్రతి సమస్యను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

ప్రతి సమస్యను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

CTR: ఎస్‌ఆర్ పురం మండలం పిల్లారికుప్పం గ్రామ పంచాయతిలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి తనతోపాటూ కూటమి నాయకులు సహకరించాలని కోరారు. తన జీవితం ప్రజా సేవకు అంకితమని థామస్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.