నిప్పుల కొలిమిలా ఉమ్మడి నిజామాబాద్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. ఉ.10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తమ పనులను ఉదయం ముగించుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు. ఎండ దెబ్బకు రహదారులన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి.