డ్రైవర్‌పై దాడి ఘటనలో కేసు నమోదు

డ్రైవర్‌పై దాడి ఘటనలో కేసు నమోదు

W.G: మద్యం మత్తులో కళాశాల బస్సు నిలిపి వీరంగం సృష్టించి డ్రైవర్‌పై దాడి చేసిన ఇద్దరిపై ఎస్సై నాగరాజు కేసు నమోదు చేశారు. ఆకివీడులోని ఓ కళాశాలకు చెందిన ప్రైవేట్ బస్సు విద్యార్థులను దింపేందుకు పెదకాపవరం వెళ్లింది. భీమవరానికి చెందిన రెడ్డి సతీశ్, విజయ్ కుమార్‌లు బస్సుకు అడ్డంగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి డ్రైవర్ శ్రీనివాస్‌పై దాడి చేసినట్లు ఎస్సై తెలిపారు.