లీడింగ్ బ్యానర్‌లో నితిన్‌ కొత్త సినిమా

లీడింగ్ బ్యానర్‌లో నితిన్‌ కొత్త సినిమా

హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ 24వ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. వరుస పరాజయాల్లో ఉన్న నితిన్, ఈ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. స్టైలిష్ లుక్‌లో ఉన్న నితిన్ పోస్టర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.