నా ఆరోగ్యం నిలకడగా ఉంది: యనమల
AP: తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై TDP సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. గుండె సంబంధిత సమస్యతో HYDలోని ఆస్పత్రిలో చేరానని, వైద్యులు స్టెంట్ వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.