వేసవి సెలవుల్లో జాగ్రత్తలు పాటించండి: CI

వేసవి సెలవుల్లో జాగ్రత్తలు పాటించండి: CI

CTR: వేసవి ప్రారంభంతో దొంగతనాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పుంగనూరు సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు బలమైన తాళాలు వేసుకోవాలన్నారు. ఎక్కువ రోజులు బయటకు వెళ్లే వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.