సైబర్ సిటిజన్ యాప్ ద్వారా ప్రజలకు అవగాహన

NTR: ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. పోగొట్టుకున్న, దొంగలించబడ్డ ఫోన్లను టెక్నాలజీతో గుర్తించి యజమానులకు అందజేస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోను కొనుగోలు చేసే వారు కూడా జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.