కేరళలో కమలం సెన్సేషన్.. థరూర్ రియాక్షన్ ఇదే!
కమ్యూనిస్టుల అడ్డాలో బీజేపీ చరిత్ర సృష్టించింది. 45 ఏళ్లుగా LDF చేతిలో ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, స్థానిక ఎంపీ శశి థరూర్ స్పందించారు. 'ప్రజల తీర్పును గౌరవించాలి.. బీజేపీకి కంగ్రాట్స్' అంటూ ట్వీట్ చేశారు. 45 ఏళ్ల పాలనపై వ్యతిరేకత ఉందని, జనం మార్పు కోరుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.