కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే
కృష్ణా: గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలోని పి.యమ్.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నూతనంగా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.