VIDEO: ఈవీ కారులో అసెంబ్లీకి వచ్చిన మంత్రి పొన్నం

VIDEO: ఈవీ కారులో అసెంబ్లీకి వచ్చిన మంత్రి పొన్నం

TG: ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలకు 10 నుంచి 20 శాతం ప్రోత్సాహకానికి ముందుకు వచ్చిన టాటా మోటార్స్‌ను ఆయన అభినందించారు. అంతేకాకుండా 100 శాతం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు.