'ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి'
SRPT: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని, పేదలందరికీ 24 గంటల వైద్యం అందించాలని కోరుతూ.. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేపట్టాలని, పేదల వైద్యానికి అధిక బడ్జెట్ కేటాయించాలని ఆ సంఘం నాయకులు రాములు, సైదులు అన్నారు.