VIDEO: రాములబండ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

VIDEO: రాములబండ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి

నల్లగొండ మండలం రాములబండలోని శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై గ్రామస్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామస్తుల ఐక్యతే ఉత్సవాల విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాములబండలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.