'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'
VZM: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని గంట్యాడ ఎంపీడీవో రమణమూర్తి ఆదేశించారు. మంగళవారం గంట్యాడ మండలం రేగుపెల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను నిశితంగా పరిశీలించారు. అన్ని రకాల సేవలు పూర్తిస్థాయిలో అందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో పొలం గట్లపై పెంచుతున్న కొబ్బరి మొక్కలను పరిశీలించారు.