VIDEO: కౌన్సిల్ సమావేశంలో వైసీపీ రసాభాస
గుంటూరు GMC కౌన్సిల్ సమావేశం సోమవారం వాడివేడిగా ప్రారంభమైంది. వార్డుల్లో అభివృద్ధి పనుల నిలిపివేతపై YCP కార్పొరేటర్‌లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు మొదలుపెట్టడం లేదని ప్రశ్నించారు. వార్డుల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, వారికి ఏం సమాధానం చెప్పాలని అధికారులపై విమర్శలు గుప్పించారు.