ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్‌ను సోమవారం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో పార్లమెంట్ వేదికగా ఎంపీ చేసిన పోరాటాన్ని, పట్టుదలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు.