మూగబోయిన బీఎస్ఎన్ఎల్ సంకేతాలు

ASR: డుంబ్రిగూడ మండలంలోని తూటంగి, గుంటసీమ పంచాయతీల్లో బీఎస్ఎన్ఎల్ సంకేతాలు గత 15 రోజులుగా మూగబోయాయి. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంకేతాలు లేక గ్రామ, వార్డు సచివాలయం వద్ద వివిధ సర్టిఫికెట్లతోపాటు ఇతర సేవలకు అంతరాయం ఏర్పడిందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సంకేతాలను పునరుద్ధరించాలని గిరిజనులు కోరుతున్నారు.