ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
KRNL: నగరంలోని డిమార్ట్ సమీపంలోని శుక్రవారం ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. బాలాజీనగర్‌కు చెందిన సాదిక్, సాజిదా అనే అక్కాతమ్ముళ్లు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.